కైలాస్ మానస సరోవర యాత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్రమంలోనే మాసస సరోవర యాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అన్నీ అనుకూలిస్తే వచ్చే మే, జూన్ నెల నుంచే యాత్ర మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పుకున్నాం కదా. భారత్, చైనాల మధ్య ఫార్మాలిటీస్ పూర్తైతే వెంటనే కైలాస యాత్ర ప్రారంభం కావచ్చు. ఈ యాత్రకు ఏ రూట్ నుంచి అనుమతిస్తున్నారు? ఎన్ని మార్గాలున్నాయో తెలుసుకుందాం. కైలాస మానస సరోవర యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న యాత్ర. అయినా సరే ఈ యాత్ర తప్పనిసరిగా చేయాలని భావిస్తారు.
కైలాస మాసన సరోవర యాత్రకు ఎలా వెళ్లాలో ముందుగా తెలుసుకుందాం. ఈ యాత్రకు ప్రధానంగా మూడు దారులున్నాయి. ఏ దారి ఎంచుకోవాలనేది మీరుండే ప్రదేశాన్ని బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి.. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లి లిపులేఖ్ పాస్ మీదుగా మాసన సరోవరం వెళ్లడం. రెండో మార్గం.. సిక్కింలోని నాథులా పాస్ మీదుగా మానస సరోవరం వెళ్లడం. మన దేశం నుంచి అయితే ఇవి రెండే మార్గాలున్నాయి. ఇవి రెండూ కాకుండా నేరుగా భూటాన్ రాజధాని లాసా వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ రూట్ ద్వారా మానస సరోవరం కూడా చేరుకోవచ్చు.