
మరికొద్ది రోజునల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఇతర మాసాలతో పోలిస్తే శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో శుభకార్యాలు, వ్రతాలు, పండుగలు, పర్వదినాలు చాలానే వస్తుంటాయి. దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక ప్రత్యకతను కలిగి ఉంటుంది. ఆగస్ట్ 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 3వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ మాసంలో ముఖ్యంగా శివుడిని పూజిస్తారు. శ్రావణమాసంలో ముఖ్యంగా వరలక్ష్మీ దేవి వ్రతం చేసుకుంటారు. ఇక మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతం.. ఇవి మాత్రమే కాకుండా రక్షాబంధన్ వంటి పండుగలు సైతం ఈ శ్రావణ మాసంలోనే రానున్నాయి.
శ్రావణ మాసంలో వచ్చే ప్రముఖ పండగలు, పర్వదినాలు
ఆగస్ట్ 5, సోమవారం:- శ్రావణ సోమవారం
ఆగస్ట్ 6, మంగళవారం:- మంగళ గౌరీ వ్రతం
ఆగస్ట్ 7, బుధవారం:- హరియాలి తీజ్, స్వర్ణ గౌరీ వ్రతం
ఆగస్ట్ 8, గురువారం:- సంకష్ట హర వినాయక చతుర్థి
ఆగస్ట్ 9, శుక్రవారం:- నాగ పంచమి
ఆగస్ట్ 10, శనివారం:- కల్కి జయంతి
ఆగస్ట్ 11, ఆదివారం:- తులసీదాస్ జయంతి
ఆగస్ట్ 12, సోమవారం:- శ్రావణ సోమవారం ఉపవాసం,
ఆగస్ట్ 13, మంగళవారం:-రెండవ శ్రావణ మంగళ గౌరీ వ్రతం, దుర్గాష్టమి.
ఆగస్ట్ 16 , శుక్రవారం:- శ్రావణ పుత్రదా ఏకాదశి, వరలక్ష్మీ వ్రతం
ఆగస్ట్ 17, శనివారం:- శని ప్రదోష వ్రతం
ఆగస్ట్ 19, సోమవారం:-శ్రావణ సోమవారం .. జంద్యాల పౌర్ణమి, రక్షాబంధన్
ఆగస్ట్ 22, శుక్రవారం:- శ్రావణ శుక్రవారం మూడో వరలక్ష్మి వ్రతం
ఆగస్ట్ 26, సోమవారం – శ్రీ కృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 27, మంగళవారం – శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం
ఆగస్ట్ 29, గురువారం – అజ ఏకాదశి
ఆగస్ట్ 30, శుక్రవారం:- నాలుగో వరలక్ష్మి వ్రతం
ఆగస్ట్ 31, శనివారం – ప్రదోష వ్రతం
