నారదుని మాటలతో శోకసంద్రంలో విప్రదంపతులు.. ఏం చెప్పాడంటే..

శ్రీహరి వర ప్రభావంతో విప్ర బ్రహ్మణ దంపతులకు పుత్రుడు జన్మించాడని తెలుసుకున్నాం కదా. ఆ బాలుడు దినదినాభివృద్ది చెందసాగాడు. ఒకరోజు విప్ర బ్రాహ్మణ దంపతుల ఇంటికి నారదుడు వచ్చాడు. బాలుడిని చూసి తండ్రితో ‘నీ కుమారునికి పన్నెండేళ్ల ఆయుష్షు మాత్రమే ఉందని చెప్పాడు. ఆ తరువాత అతను మరణిస్తాడని చెప్పి వెళ్లిపోయాడు. నారదుని మాటలు విన్న విప్ర దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యం విప్రుని భార్య కుమారుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని నారదుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని కుమిలిపోతూ ఉండేది.

బాలుడికి పన్నెండేళ్ల వయసు వచ్చింది. విప్రుడు తన కుమారునికి ఉపనయనాది కర్మలు యథావిధిగా జరిపించాడు. విప్రుని భార్య మాత్రం కుమారుని మరణాన్ని ఎలా భరించగలమా? అని దు:ఖిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆమె తన భరత్తో తాను పుత్ర శోకాన్ని భరించలేనని.. కాబట్టి నదిలో దూకి ప్రాణ త్యాగం చేసుకునేందుకు ఆజ్ఞ ఇవ్వాలని కోరింది. తన భార్య మాటలు విన్న విప్రుడు ఆమె వద్దకు వెళ్లి ఆత్మజ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించాడు. గృత్స్నమద మహర్షి ఇక్కడి వరకు చెప్పి పదిహేడవ అధ్యాయాన్ని ముగించాడు.

Share this post with your friends