భక్తి మార్గపు పరమసత్యాన్ని బోధించే భగవద్గీత శ్లోకమేంటంటే..

భగవద్గీతో భక్తి మార్గపు పరమ సత్యాన్ని బోధించే శ్లోకం ఒకటి ఉంటుంది. ఈ శ్లోకంలో గీతాచార్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ॥

(భగవద్గీత 9.34)

దీని అర్థమేంటంటే..

ఈ శ్లోకం భక్తి మార్గపు పరమసత్యాన్ని బోధిస్తోంది. భగవంతునిపై మనస్సును నిలిపి, చిత్తశుద్ధితో అర్చించడం ద్వారా మోక్షం సాధ్యమని గీతాచార్యుడు చెబుతున్నాడు. దానవుల్లా స్వార్థ తపస్సు కాదు, నిష్కామ భక్తి మాత్రమే రక్షణకారి. వినమ్రతతో శిరస్సు వంచి, మనసు-మాట-కార్యములను దేవునికే అర్పించడం అసలైన సాధన. భాగవతంలో చెప్పిన నవవిధ భక్తులలో ఏ మార్గమైనా ఎంచుకుని నిష్కామంగా కొనసాగాలి. భక్తి వల్ల హృదయ మలిన్యం తొలగి, పాపాలు సహజంగా నశిస్తాయి. భౌతిక బంధనాలు మెల్లగా కరిగి, పరబ్రహ్మ దర్శనానికి మనసు సిద్ధమవుతుంది. శుద్ధ భక్తులను కాపాడే బాధ్యతను భగవంతుడు స్వయంగా వహిస్తానని గీతా వాగ్దానం చేస్తోంది. కాబట్టి భక్తి యుక్తమైన సత్ప్రయత్నమే మానవజీవనానికి పరమార్థం.

Share this post with your friends