400 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయ విశిష్టత ఏంటంటే..

హిందూ ధర్మంలో వినాయకుడికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా.. ఏ పూజ నిర్వహించినా తొలి పూజ విఘ్నేశ్వరుడికే నిర్వహిస్తాం. ఇలా వినాయకుడికి పూజలు నిర్వహిస్తే చేపట్టిన పనిలో అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఒక వినాయకుడి ఆలయం ఉంటుంది. గణేశుడి ఆలయాల్లో కొన్ని ఆలయాలు అత్యంత విశిష్టమైనవి. కాణిపాకం వినాయకుడు, సింధూర వినాయకుడు వంటి ఆలయాలన్నీ ప్రఖ్యాతి గాంచాయి. ఇలాంటి విశిష్టమైన గణపతి దేవాలయం ఒకటి రాజస్థాన్‌లో ఉంది. ఈ ఆలయం ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని బవాడి అనే గ్రామంలో ఓ గణేశుడి ఆలయం ఉంది. ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటే చాలు.. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం. ఇక్కడ కొలువైన వినాయకుడిని బవాడి గణేశ్ అని పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల నాటిదని చెబుతారు. 400 ఏళ్ల క్రితం ఇక్కడ ఓ మెట్ల బావి తవ్వుతుండగా వినాయకుడి విగ్రహం బయల్పడిందట. వెంటనే ఆ విగ్రహాన్ని బయటకు తీసి ఒక వేదికపై ఉంచి పూజలు నిర్వహించేవారు. ఆ తరువాత అక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.

Share this post with your friends