
కాకి సైతం మన జీవితానికి అవసరమైన మంచిని చెబుతుందట. కాకి.. కావు కావు కావు కావుమని అరుస్తుందంటే ఏవీ నీకు శాశ్వతం కావని అర్థమట. కాకి ప్రతీ ఊరిలో, ప్రతీ ఇంటిపై వాలి ఏదో ఒక సమయంలో అరిచే ఉంటుంది. దానర్థం ‘నువ్వు నిరంతరం ఎంతో శ్రమించి సంపాదించిన సంపదలు శాశ్వతం కావు’ అని. బంధాలు శాశ్వతం కావు… ఏ కోరికలూ శాశ్వతం కావు… నువ్వు చూసేవి చేసేవి ఏవీ శాశ్వతం కావు… ఏదీ శాశ్వతం కానపుడు మరి ఎందుకు ఇంత తపన? నీది కాని దాని కోసం నువ్వు ఎంత తపించినా ప్రయోజనము లేదు.
నీకు చెందవల్సింది నీవు వద్దు అన్నా నీకు చెంది తీరుతుంది. లేని దాని కోసం ఉన్నదానిని వదులుకోకు. ప్రపంచం అసత్యం, అశాశ్వతం. ఒక్క పరమాత్మ మాత్రమే సత్యము, శాశ్వతమని తెలుసుకుని మసలుకోవాలి. అన్ని శాస్త్రాలు చదివి, ఇన్ని తెలిసికూడా మనం మాయలో ఎందుకు పడుతున్నాం? అంటే భగవంతునిపై విశ్వాసం లేక, భగవన్నామమును, మనఃస్ఫూర్తిగా పలుకక పోవడం వల్ల అలా జరుగుతుందట. అంటే మన జీవితం అంతా పార్ట్ టైమ్ భక్తి, పొద్దునో.. సాయంత్రమో దేవుని గుడి ముందు కూర్చున్నప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు. మిగతా సమయమంతా నాది అనే భ్రమలో బతుకుతామని పండితులు చెబుతున్నారు.
