వినాయకుడి రూపాన్ని ప్రతిబింబిస్తోన్న చెట్టు కాడ.. నెట్టింట వైరల్..

మనం చూడాలే కానీ ప్రతి వస్తువులోనూ దైవం కనిపిస్తుంది. ఆకాశం వంక చూసినా కూడా మనకు ఏదో ఒక రూపం దర్శనమిస్తూనే ఉంటుంది. అసలే మనం చెట్లలోనూ.. మొక్కల్లోనూ.. జంతువుల్లోనూ ప్రతి ఒక్క దానినీ దైవ స్వరూపంగా భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటాం. జాగ్రత్తగా చూడాలే కానీ ప్రకృతిలో దైవం మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. మనం నిత్యం చాలా సందర్భాల్లో అల్లం, క్యారెట్, బొప్పాయి వంటి వాటిలో వినాయకుడి రూపాన్ని చూశాం. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వింతలకు సంబంధించిన ఆసక్తికర వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది.

వినాయక చవితి వచ్చేస్తోంది. ఇప్పటికే ఎక్కడికక్కడ వినాయక మండపాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వినాయకుని భక్తులంతా ప్రకృతిలో కనిపించే వాటన్నింటిలో వినాయకుడిని చూసుకుంటున్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఇందులో ఒక చెట్టు పచ్చని ఆకులతో నిండి కనిపిస్తుంది. అయితే ఒక కాండం నుంచి ఒక ఆకు వేలాడుతూ అచ్చంగా వినాయకుని రూపాన్ని ప్రతిబింబిస్తోంది. ఓం కార రూపంలో ఉన్న వినాయకుడి దివ్వరూపాన్ని గోచరిస్తోంది. అది చూసిన వారంతా ఆకు విఘ్నేశ్వరుని రూపం దాల్చిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇన్‌స్టా లింక్..

https://www.instagram.com/reel/C_XA22ToWWO/embed/

Share this post with your friends