బైసి పహచాలోని మూడవ మెట్టు యమ డేంజర్..

పూరి జగన్నాథుడి ఆలయంలోని 22 మెట్లను బైసీ పహచా అని పిలుస్తారని తెలుసుకున్నాం కదా. ఈ మెట్లకు సంబంధించిన రహస్యాలు చాలానే ఉన్నాయి. ఈ 22 మెట్లలో మూడవ మెట్టు చాలా డేంజర్. దీని గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఈ మూడవ మెట్టును యమ శిల అని పిలుస్తారు. ఆలయంలోకి వెళ్లేటప్పుడు దీనిపై అడుగు పెట్టి వెళ్లవచ్చు. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై అడుగు మోపకూడదు. పొరపాటున మూడవ మెట్టుపై కాలు పెట్టారో మనిషిలోని సద్గుణాలన్నీ మాయమైపోతాయని చెబుతారు.

ఈ మూడవ మెట్టు వెనుక ఒక ప్రసిద్ధ పురాణ కథ కూడా ఉంది. భక్తులు అంతా జగన్నాథ ఆలయాన్ని సందర్శించి మోక్షాన్ని పొందుతున్నారట. ఆ సమయంలో యమలోకం పూర్తిగా ఖాళీ అయిపోయిందట. అప్పుడు యముడు ఆందోళనతో జగన్నాథుడిని సంప్రదించి తన గోడుని వెళ్లబోసుకున్నాడట. దీంతో జగన్నాథుడు.. ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ మూడవ మెట్టుపై ఎవరు అడుగు పెడితే వారి సద్గుణాలన్నీ నశించిపోతాయని అప్పుడు వారు పాపాలని లెక్కించవచ్చని చెప్పాడు. అప్పటి నుంచి జగన్నాథుడిని దర్శించుకుని వచ్చేటప్పుడు భక్తులు మూడవ మెట్టుపై అడుగు పెట్టడంపై నిషేధం విధించారు.

Share this post with your friends