పూరి జగన్నాథ్ ఆలయంలోని మూడో రహస్య గది తెరుచుకునేది ఇవాళే..

పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారంలో మూడో గది ప్రస్తుతం హాట్ టాపిక్. రెండు గదుల కంటే కూడా మూడో గదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిలో అపార సంపద ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ రహస్య గదిలోకి వెళ్లాలంటే సొరంగ మార్గం ద్వారా వెళ్లాలని చరిత్రకారులు చెబుతుండటంతో ఈ మూడో రహస్య గదిపై ఆసక్తి రెట్టింపవుతోంది. దేశం మొత్తం దీని గురించే చర్చించుకుంటోంది. అసలు మూడవ రహస్య గదిలో ఏముందనే దానిపై ఉత్కంఠ రేకెత్తుతోంది. వాస్తవానికి ఎంతో అపారమైన సంపద లేకుంటే ఒక సొరంగాన్ని తవ్వి మరీ రహస్య మార్గాన్ని ఏర్పాటు చేసి ఉండరని అంతా అంటున్నారు.

రిటైర్డ్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ ఇప్పటికే రెండు రహస్య గదులను తెరిచిన విషయం తెలిసిందే. ఇవాళ ఈ కమిటీయే మూడవ గదిని తెరవనుంది. 46 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ రెండు రహస్య గదులను తెరవడం జరిగింది. వీటిలోని సంపదను స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. ఇవాళ తెరవబోయే మూడో రహస్య గదిలోని సంపదను సైతం స్ట్రాంగ్ రూమ్‌కి పంపించనున్నారు. రహస్య గదిలో ఏమున్నాయనే విషయమై ప్రచారమైతే బీభత్సంగానే జరుగుతోంది. ఈ రహస్య గదిలో 34 కిరీటాలు, రత్న ఖచిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. మరి ఈ గది తెరిస్తే కానీ ఏముందనేది తెలియదు.

Share this post with your friends