బర్సానాలో లడ్డూమర్ హోలీ.. ఈ ఉత్సవాల వెనుక కథేంటంటే..

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మధుర జిల్లాలోని బర్సానాలో పెద్ద ఎత్తున హోలీని నిర్వహిస్తారని తెలుసుకున్నాం కదా. దేశ విదేశాల నుంచి భక్తులు హోలీ ఉత్సవాలను తిలకించేందుకు బర్సానాకు వస్తుంటారు. ఇక్కడ నిర్వహించే హోలీని లడ్డూమర్ హోలీ అని పిలుస్తారు. బర్సానా అంటే రాధా రాణి జన్మస్థలం. ఇక్కడ నిర్వహించే హోలీ వెనుక ఒక కథ ఉంది. ఒకసారి రాధా రాణి తన స్నేహితులతో కలిసి నందగావ్‌కు వెళ్లి శ్రీకృష్ణుడిని హోలీకి ఆహ్వానించింది. కృష్ణుడు సైతం సంతోషంగా అంగీకరించాడని పురాణాలు చెబుతున్నాయి.

రాధ ఆహ్వానం మేరకు కృష్ణుడు బర్సానాలో అడుగు పెట్టినప్పుడు కొంతమంది గోపికలు కృష్ణుడిపై సరదాగా రంగులు చల్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పూజారి చేతి రంగులు లేవట. దీంతో సదరు పూజారి కన్నయ్యపై తన చేతిలో ఉన్న లడ్డూలు విసిరేశాడట. ఆ విధంగా లడ్డూ మార్ హోలీ సంప్రదాయం మధుర బర్సానాలోని శ్రీ జీ ఆలయంలో ప్రారంభమైంది. నాటి నుంచి ఇప్పటి వరకూ అక్కడ హోలీ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఆ ఉత్సవాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి బర్సానాకు పర్యాటకులు తరలి వస్తుంటారు.

Share this post with your friends