బ్రాహ్మి ముహూర్తం గురించి వింటూనే ఉంటాం. మనకు ఉండే రాత్రి, పగళ్లను రెండు భాగాలుగా చేశారు. అయితే వీటిలో ఏ సమయాన్ని బ్రాహ్మి ముహూర్తంగా పరిగణిస్తారు? అసలు బ్రాహ్మి ముహూర్తం అంటే ఏమిటి? ఈ ముహూర్తం తర్వాత వచ్చే ముహూర్తాన్ని ఏమంటారు? జ్యోతిష శాస్త్రం, ధర్మ శాస్త్రం రెండూ బ్రాహ్మి ముహూర్తం గురించి ఏం చెబుతున్నాయి? బ్రాహ్మి ముహూర్త సమయంలో ఏం పనులు ఆచరించాలి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం. మనకు ఉండే రోజును రాత్రి, పగలు అనే రెండు భాగాలుగా విభజించారు. వాటిలో రాత్రి వెళ్లిపోయి.. పగలుకు తెరదీసే సమయాన్ని బ్రాహ్మి ముహూర్తంగా పేర్కొంటారు.

ఈ ముహూర్తం దాటిన తర్వాత వచ్చే ముహూర్తాన్ని రౌద్రి ముహూర్తమని అంటారు. అయితే బ్రాహ్మి ముహూర్తం అత్యంత శ్రేష్టమైనదిగా చెబుతారు. జ్యోతిష, ధర్మశాస్త్రం ప్రకారం సూర్యోదయానికి 96 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మి ముహూర్తంగా పరిగణిస్తారు. పంచాంగం ప్రకారం అయితే సూర్యోదయ సమయాలు మారుతూ ఉంటాయి. దేవతలు, పితృదేవతలు కలిసి ఉండటమనేది జరగదు. కానీ ఈ బ్రాహ్మి ముహూర్తంలో మాత్రం వీరిద్దరూ కలిసి ఉంటారట. ఈ సమయంలో దేవతారాధనను ప్రారంభించడం చాలా మంచిదని చెబుతారు. ఆ సమయంలో నిద్ర లేచినా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారట. రోజంతా చాలా మంచిగా గడుస్తుందట.
