రామలింగేశ్వర స్వామివారి ఆలయంలోని బుగ్గ ప్రాధాన్యతేంటంటే..

బుగ్గ రామలింగేశ్వర స్వామివారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి 6 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏటా రెండు ఉత్సవాలు జరుగుతాయి. మాఘ అమావాస్య రోజు ఉగాది, శ్రీరామనవమి రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి విశేషం బండరాల్ల మధ్యన పారే నీటి బుగ్గ. ఎలాంటి సమయంలోనూ.. ఎంత కరువు సమయంలోనూ ఈ నీటి బుగ్గ ఆగింది లేదు. దీనికి కారణం అక్కడ మునులు తిరుగాడటమేనని అంతా చెబుతారు.

వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేశారట. ఆ సమయంలో పూజా కార్యక్రమాల కోసమని శివలింగాన్ని ప్రతిష్టించారని చెబుతారు. బండరాళ్ల మధ్యలో నుంచి నీరు సన్నని ధారలాగా ప్రవహిస్తుందడంతో అలయానికి బుగ్గ రామలింగేశ్వరుడుగా నామకరణం చేశారు. ఈ బుగ్గ నుంచి వచ్చిన నీరు ఆలయంలోని కోనేరులోకి వస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులంతా ఈ కోనేటిలోనే స్నానమాచరిస్తూ ఉంటారు. ఈ కోనేరులో భక్తులు స్నానమాచరించి రామలింగేశుని దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పుణ్యం దక్కుతుందట. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ కోనేటి నీటితోని ఈ ప్రాంతవాసులు పంటలు పండించుకుంటారు. అలాగే బుగ్గ నుంచి నీటిని తీసుకెళ్లి పంటపొలాల్లో చల్లుకోవడం వలన చీడపురుగులు రావట.

Share this post with your friends