పొడి విభూతిని పెట్టుకోవడం వెనుక రహస్యమేంటంటే..

శాస్త్రములో శివనామము గంగ. విభూతి యమునా. రుద్రాక్ష సరస్వతి. గొప్ప శివభక్తుడు లలాటముపై త్రిపుండ్రములను ధరించిన వాడై, బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తిచేసి బయటకు వస్తే, అలా పూజామందిరంలోంచి బయటకు రాగానే ఆయన్ని చూసిన వారికి త్రివేణీసంగమ స్నానాన్ని చేసిన ఫలితము లభిస్తుందని చెబుతారు. ఈమూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది. విభూతిని ధరించదానికి ఒక పధ్ధతి చెబుతారు. దీనిని ఎలా బడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం, నిద్రలేచిన తరువాత స్నానం అయేవరకు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకూడదు. కానీ ఇప్పటి రోజుల్లో అలా చేయగలిగినవారు ఎంతమంది? అన్ని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.

ఒక వేళ అలా స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి వస్తే, ఆ పాపం గాయత్రి జపం చేయడం వలన సాధ్యమయినంత తొందరగా పోతుంది. అలా చేయలేనివారు, వారి ఇష్టదేవత పేరున పూజచేసుకోవాలి. స్నానం చేయకుండా బయటికి వెళ్లాల్సి వచ్చిన సందర్భాలలో పొడి విభూతిని తీసుకుని దరించవచ్చు. కానీ తడి విభూతిని పెట్టుకోకూడదు. ఇలా పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చెయ్యనంత వరకు శరీరానికి అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా దుష్టమైన శక్తుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా రక్షణ ఇవ్వగలిగింది విభూతి. అందువలన విభూతిని పెట్టుకోవాలి.

Share this post with your friends