
పూరి జగన్నాథ్ ఆలయంలో ఎన్నో మిస్టరీలున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. మూడు రథాలపై శ్రీకృష్ణుడు, బలభద్రుడు, సుభద్ర భక్తులను కటాక్షిస్తారు. ఇక పూరి ఆలయమే కాదు.. ఇక్కడి సముద్రం కూడా ప్రత్యేకమే. మరి ఆ ప్రత్యేకతేంటో తెలుసుకుందాం. సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపుకి ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేల వైపు నుంచి సముద్రంవైపునకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. ఇంకా చాలా విశేషాలున్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం.
సింహ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ.. ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే.. సముద్రం నుంచి వచ్చే శబ్ధం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగుపెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుందంటే.. దీనికి కూడా ఓ కారణం ఉంది. ఇద్దరు దేవుళ్ల సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతారు. అంతేకానీ దీనివెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు. జగన్నాథ ఆలయం పైన పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు.
