
ఏదో ఒక సందర్భంలో మనం బహుమతులు ఇస్తూనే ఉంటాం. పెళ్లి, పుట్టినరోజు, ఇతర సందర్భాల్లో తప్పక బహుమతులు ఇస్తుంటాం. అయితే బహుమతులు ఏవి పడితే అవి ఇవ్వకూడదు. బహుమతులు ఇచ్చే సమయంలోనూ కొన్ని నియమాలను తప్పక పాటించాలి. లేదంటే వాస్తు పరమైన ఇబ్బందులు కూడా తలెత్తవచ్చట. కాబట్టి బహుమతి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వాలట. లేదంటే ముందుగా దెబ్బ రిలేషన్‌షిప్‌పై పడుతుందట. మరి ఏ వస్తువులను బహుమతిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదో తెలుసుకుందాం.
సాధారణంగా నలుపు రంగు వస్తువులు చాలా ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తాయి కాబట్టి వాటిని బహుమతిగా ఇచ్చేందుకు ఎంచుకుంటాం. కానీ నలుపు రంగులో ఉండే బట్టలైనా.. ఇతర వస్తువులైనా ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతిగా ఇవ్వకూడదట. అలాగే గడియారాలు, షూ, చెప్పులు వంటివి సంబంధాలను దూరం చేస్తాయి కాబట్టి వాటిని కూడా ఇవ్వకూడదు. కొందరు పెర్ఫ్యూమ్స్ ఇష్టపడతారని.. వాటిని బహుమతిగా ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ వాటిని బహుమతిగా ఇస్తే మనం ఆర్థిక కష్టాల్లో పడవచ్చట. ముత్యాలు కూడా అందంగా ఉన్నాయి కదా అని పొరపాటున కూడా బహుమతిగా ఇవ్వకూడదు.
