హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్‌లో ఉన్న శివాలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఇక్కడి ఆలయంలోని నీరు గడ్డ కట్టే చలిలోనూ మరుగుతూనే ఉంటాయని చెప్పుకున్నాం. అసలు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథేంటో తెలుసుకుందాం. ఈ శివాలయానికి సంబంధించిన కథ చాలా ప్రాచుర్యం పొందింది. శివుడిని మెప్పించడం చాలా తేలిక కానీ ఆయన ఆగ్రహం నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు. పురాణ కథ ప్రకారం ఒకసారి నదిలో పార్వతీదేవి ఆటలాడుతుండగా అమ్మవారి చెవిపోగు ముత్యం నీటిలో నీటిలో పడిపోయిందట.
అలా ఆ ముత్యం నీటిలో ప్రవహిస్తూ భూలోకం నుంచి పాతాళానికి చేరుకుంది. అయితే ముత్యం నీటిలో పడిపోయిన విషయాన్ని శివయ్యకు పార్వతీ మాత చెప్పిందట. ఎక్కడ ఎంత వెతికినా వారికి ఆ ముత్యం దొరకలేదట. దీంతో శివయ్యకు పట్టరాని కోపం వచ్చిందట. దీంతో మూడో కన్ను తెరిచాడు. మహాదేవుని కోపాగ్నికి నదిలో నీరు మరగడం ప్రారంభమైందట. శివుని ఉగ్రరూపాన్ని చూసిన దేవి పాతాళలోకానికి వెళ్లి పార్వతీ మాత ముత్యాన్ని తిరిగి ఇచ్చేయమని శేషునాగుని కోరిందట. దీంతో శేషనాగు పాతాళంలో బుసలు కొట్టడంతో అనేక రత్నాలు భూమిపైన వివిధ ప్రదేశఆల్లో పడ్డాయట. ఆ రత్నాల్లో పార్వతీమాత ముత్యాన్ని తీసుకుని శివుడు మిగిలిన వాటన్నింటినీ రాళ్లుగా మార్చి నదిలో విసిరేశాడట. ఇదీ ఆలయ కథ.