శని మందగమనుడికి మారడానికి కారణం ఏంటంటే..

పిప్పలాథుని కథ గురించి తెలుసుకున్నాం. తన చిన్నప్పుడే తన తండ్రి అకాల మరణానికి కారణమై.. తనను అనాథను చేసిన శని దేవుడిపై కోపంతో బ్రహ్మ గురించి తపస్సు చేశాడని తెలుసుకున్నాం కదా. అప్పుడు పిప్పలాదుడికి బ్రహ్మ తన కంటి చూపుతో ఎవరిని దహనం చేయాలనుకున్నా చేయవచ్చనే వరం కోరుకున్నాడని కూడా తెలుసుకున్నాం. ఆ వరంతో శని దేవుడిని దహించి వేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవతలందరూ పూనుకున్నా కూడా శనిదేవుడిని రక్షించలేకపోయారు. అప్పుడు సూర్యుడు తన కుమారుడిని రక్షించమని బ్రహ్మను వేడుకోవడంతో పిప్పలాదుడికి రెండు వరాలిచ్చి శనిదేవుడిని రక్షించాడు.

మరి శనిదేవుడు మందగమనుడిగా ఎలా మారాడు అంటే.. బ్రహ్మదేవుడు వరమిచ్చిన తర్వాత పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. అయితే అప్పటికే అగ్ని వేడిమికి శనిదేవుని పాదాలు దెబ్బతిన్నాయట. దీంతో శనిదేవుడు మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. మందగమనుడిలా నడవడం ఆరంభించాడట. అందుకే శనికి మందగమనుడు అంటే మెల్లగా నడిచే వాడని పేరు వచ్చింది. అలాగే అగ్ని వేడిమి కారణంగా శని దేవుడు నల్లగా మారాడట. కాబట్టి నల్లని వస్త్రాలు సమర్పించడం ద్వారా శనిదేవుడు ప్రీతి చెందుతాడు. అలాగే ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఆశ్రయమిచ్చిన రావి చెట్టును పూజించడం వెనుక ముఖ్య ఉద్దేశం పిప్పలాదుడికి కోరిక కోరికేనట. పిప్పలాదుని ఈ కథను ప్రతి శనివారం చదివితే శని దోషాలన్నీ తొలగిపోతాయట.

Share this post with your friends