10 రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనానికి కారణం శ్రీ మహవిష్ణువు సమావేశమేనట..

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఉంటుందని ముందే తెలుసుకున్నాం కదా. శ్రీ వేంకటేశ్వరుని గర్భగుడి దగ్గర ఉన్న ఉత్తర ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచబడుతుంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ముందు భక్తులు ఉత్తర ద్వారం గుండా ప్రవేశించడానికి.. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. దీనికి కారణం భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించడమే. అయితే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి కారణం కూడా భక్తుల రద్దీయేనని చెప్పుకున్నాం. అయితే మరో కారణం కూడా ఉంది.

పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు తన శిష్యులతో వైకుంఠంలో ఒక సమావేశాన్ని నిర్వహించాడట. ఆ సమావేశానికి దేవతలను మాత్రమే కాకుండి భక్తులను కూడా ఈ సభలోకి అనుమతించాడట. భూమిపై ప్రతీకాత్మకంగా ప్రతిబింబించే ఈ ఖగోళ సమావేశం పది రోజులు ఉంటుంది. కాబట్టి ఉత్తర ద్వారం కూడా పది రోజుల పాటు తెరిచి ఉంచాలని.. భక్తులను ఈ పది రోజులు స్వామివారిని ఈ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి అనుమతించాలని పోంటీఫ్‌లు, టీటీడీ పరిపాలన అధికారులు నిర్ణయించారు. తొలుత ఒకరోజు.. ఆ తరువాత రెండు రోజులు.. ఇప్పుడైతే ఏకంగా పది రోజుల పాటు పొడిగించారు. ఈ రోజులలో స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులు మోక్షాన్ని పొందుతారని బలమైన నమ్మకం ఉంది.

Share this post with your friends