నవరాత్రుల్లో పురుషులు.. స్త్రీల్లా రెడీ అయ్యి డ్యాన్స్ చేయడం వెనుక కారణమేంటంటే..

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో షాపూర్ ప్రాంతంలోని సాధు మాత గలి, అంబా మాత ఆలయాల్లో నవరాత్రుల్లో ఆండ్రీ అష్టమి నాటి రాత్రి పురుషులు.. స్త్రీల మాదిరిగా రెడీ గర్భా డ్యాన్స్ చేస్తారని ముందుగానే చెప్పుకున్నాం. ఇలా 200 ఏళ్లుగా జరుగుతోంది. దీనికి ఓ కారణముంది. శాప విమోచనానికి ప్రాయశ్చిత్తంగా బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు ఇలా చేస్తారట. ఆ శాపమేంటో తెలుసుకుందాం. మొఘలుల కాలంలో వారి దృష్టి సాదుబెన్ అనే మహిళపై పడిందట. మొఘల్ రాజు ఆమెను తీసుకెళ్లేందుకు యత్నించగా.. ఆమె బారోట్ కమ్యూనిటీ సాయం కోరింది.

దురదృష్టవశాత్తు బారోట్ కమ్యూనిటీ పురుషులు మొఘలుల చేతుల నుంచి సాధుబెన్‌ను రక్షించలేకపోయారు. దీంతో ఆమె బిడ్డ మృతి చెందింది. బిడ్డ మరణంతో క్రుంగిపోయిన సాదుబెన్ తనను రక్షించలేకపోయిన బారోట్ కమ్యూనిటీ పరుషులను మీ భావి తరాలు పిరికిపందలుగా మారుతాయని శపించిందట. ఆ తరువాత సాదుబెన్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందట. సాదుబెన్ శాపం, మరణంతో బారోట్ కమ్యూనిటీలో భయం నెలకొందట. దీంతో సాదుబెన్ ఆత్మను ప్రసన్నం చేసుకునేందుకు.. అలాగే తమకు శాప విమోచనం కోసం అహ్మదాబాద్‌లో ఆమె పేరిట ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి శాప విమోచనం కోసం పురుషులు.. స్త్రీల మాదిరిగా చీర కట్టుకుని గర్భా నృత్యం చేస్తారు.

Share this post with your friends