శంఖనాదంతో ఉద్భవించే సానుకూల శక్తులు, ఫలితాలేంటంటే..

శంఖనాదం గురించి తెలుసుకున్నాం. ఇది ఎన్ని రకాలో కూడా తెలుసుకున్నాం కదా. వైదిక శాస్త్రం ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది. ఈ శంఖనాదం కారణంగా చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. శంఖ ధ్వని కారణంగా కేవలం పాజిటివ్ శక్తి మాత్రమే కాదు.. ఇది విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక అని చెబుతారు. ఇంట్లో వాస్తుదోషాలను సైతం ఇది తొలగిస్తుందట. ఈ శంఖనాదం వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, మనశ్శాంతి , వివాహం కాని వారికి వివాహప్రాప్తి కలుగుతాయని నమ్మకం. అంతేకాకుండా నిత్యం శంఖాన్ని ఊదితే శ్వాస సంబంధిత వ్యాధులు దరి చేరవని.. తద్వారా ఆస్తమా కూడా తగ్గుతుందట.

శంఖాన్ని నీటితో నింపి పూజ గదిలో పెడతారని తెలుసుకున్నాం కదా. రాత్రి పూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఆధ్యాత్మిక శబ్ధ తరంగాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలాగే శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మంతో అనేక రోగాలు నయమవుతాయట. గోముఖ శంఖాన్ని పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయట. శంఖాన్ని వ్యాపార ప్రదేశంలో పెట్టుకుంటే వ్యాపార, ధనాభివృద్ధి కలుగుతుంది. అయితే శంఖాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బోర్లించి పెట్టకూడదట. శంఖం ఉన్న ఇంట ఆర్థిక ఇబ్బందులు ఉండవట.

Share this post with your friends