బోయవాడికి ముని బోధించిన తత్వమేంటంటే..

బోయవాడు, ఆరుణి ముని గురించి తెలుసుకున్నాం కదా. దేవకి నదిలోకి ముని దిగుతుండగా.. వేటగాడు ఆయన వస్తువులను దొంగిలించబోయాడు. అప్పుడు ముని చూసిన చూపుతో బోయవాడు మారిపోయాడు. తనకు సత్యవ్రతం బోధించమని కోరగా.. ముని సైలెంట్‌గా వెళ్లిపోయాడు. అయినా సరే మునికి సపర్యలు చేస్తూ ముని ఉండిపోయాడు. ఒకరోజు ముని దర్బలు సేకరిస్తుండి పులి వచ్చి ఆయనపై పడింది. బోయవాడు తన వద్ద ఉన్న గొడ్డలితో దానిని ఒక్క దెబ్బ వేశాడు. కానీ ముని మాత్రం మౌనంగా పులి వంక చూశాడు. అలాగే ‘ఓం నమో భగవతేవాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాడు.

ఆ మంత్రం చెవిన పడగానే పులి దివ్యదేహాన్ని ధరించింది. ఆపై మునికి పులి నమస్కరించి, అక్కడి నుంచి వెళ్లిపోయింది. బోయవాడికి జరిగిన ఘటన చూసి ఆశ్చర్యం వేసింది. ఏం జరిగిందో తెలియక క్షణకాలం పాటు విస్తుబోయి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు బోయవాడికి ముని హితబోధ చేశాడు. ఎలా ఉంటే కష్టం దరి చేరదనేది చెప్పాడు. ఎప్పడూ సత్యాన్నే పలుకమని.. మాంసాహారాన్ని మానేయమని బోయకు ముని తెలిపాడు. దీనిని వ్రతంలా ఆచరించాలని తెలిపాడు. అప్పటి నుంచి బోయవాడు అహింసను వీడి సత్యాన్నే పలుకుతూ నిష్టగా జీవించసాగాడు.

Share this post with your friends