అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహామంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం.. అనన్యం, సర్వసిద్ధిప్రదం. అయితే గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాల అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. త – అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స – ఉపపాతకములను నివారించునది
3. వి – మహాపాతములను నివారించునది
4. తు – దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ – భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే – తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి – తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం – బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9. భ – పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో – గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11. దే – స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ – గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య – మానసిక దోషాలను నివారించును
14. ధీ – మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ – పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి – అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి – ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః – సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో – సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః – ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర – విష్ణులోక ప్రాప్తి
22. చో – రుద్రలోక ప్రాప్తి
23. ద – బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ – పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.