ఈ ఆలయ ప్రాంతంలోనే సుబ్రహ్మణ్యస్వామి, దేవసేనల వివాహం జరిగిందట..

కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధార నది ఒడ్డున ఉన్న కుక్కే అనే గ్రామంలో కొలువైన సుబ్రహ్మణ్యస్వామి గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ పురాణ గాథ ఏంటో తెలుసుకుందాం. స్కాంద పురాణం ప్రకారం, షణ్ముఖుడు తారకాసుర, పద్మాసుర అను రాక్షసులను సంహరించిన అనంతరం కుమారస్వామి తన సోదరుడు వినాయకుడితో కలిసి ఈ పర్వతాన్ని చేరుకున్నాడట. రాక్షస సంహారం కారణంగా ఇంద్రుడు చాలా సంతోషంతో ఉన్నాడట. ఈ క్రమంలోనే తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి ఈ ఆలయ ప్రాంతంలో మార్గశిర మాసం, శుద్ధ షష్ఠి నాడు వివాహం జరిపించినట్లు తెలుస్తోంది.

ఈ ఆలయ విశేషం ఏంటంటే.. ఇక్కడ రోజూ సర్ప దోష పూజలు జరగుతుంటాయి. వాటిలో ఆశ్లేషబలి, సర్ప సంస్కారలు అతి ముఖ్యమైనవి. ఈ పూజలు ఎవరైతే జరిపించుకుంటారో వారిని నాగ దోషం, కాలసర్ప దోషం, కుజ దోషం నుంచి భక్తులను సుబ్రమణ్య స్వామి రక్షిస్తాడని విశ్వాసం. అలాగే కొన్ని ముఖ్యమైన మాసాల్లో ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి, నాగ పంచమి, ఆడికృత్తిక వంటి విశేష రోజుల్లో ఈ ప్రత్యక పజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తుల తాకిడి సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు సంఖ్యలో ఉంటుందట.

Share this post with your friends