బ్రహ్మ ముహూర్తానికి సంబంధించిన పురాణ గాథ ఏంటంటే..

బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ముహూర్తానికి అధిదేవత వచ్చేసి బ్రహ్మ. సూర్యోదయానికి రెండు ఘడియల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తంగా పిలుస్తారు. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిదే బ్రహ్మ ముహూర్తమని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఈ బ్రహ్మ ముహూర్తానికి సంబంధించిన పురాణ గాథ ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు.

ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

Share this post with your friends