
మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ హిందూ ఆలయాలు నిర్మితమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో అతి పెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక సముదాయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడి దేశ జనాభాలో రెండు శాతం మాత్రమే హిందువులున్నారు. వారంతా ఎంతో ఆనందంగా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అక్కడి హిందువులంతా ఒక్కచోట చేరి తమ భక్తిభావాన్ని షేర్ చేసుకున్నారు. అనేక మంది భక్తులను ఆకర్షించిన ఈ ఆలయం దక్షిణాఫ్రికాలో హిందూ సమాజానికి ఒక ముఖ్యమైన మైలురాయి.
82 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు, బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బాప్స్)కు చెందిన మహంత్ స్వామి మహారాజ్ స్వామివారి ప్రాణప్రతిష్ట మహోత్సవం నిర్వహించేందుకు భారతదేశం నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మహంత్ స్వామి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దక్షిణార్ధగోళంలో అతిపెద్ద హిందూ సాంస్కృతిక సముదాయంగా బీఏపీఎస్ అభివర్ణించింది. దీనికి ముందు పెద్ద ఎత్తున జోహెన్నెస్‌బర్గ్‌లో పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. భక్తి పాటలు, సంగీతం, కవాతు బ్యాండ్లు, లయబద్దమైన నృత్యాలతో ఈ ఊరేగింపు నిర్వహించడం జరిగింది.
