
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కేంద్రం నుంచి 15 కి.మీ దూరంలో నల్ఖేడా సమీపంలో కొలువైన గడియాఘాట్ వలీ మాతాజీ ఆలయం గురించి ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకున్నాం. అసలు ఈ అద్భుతం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందా? లేదంటే ఏదైనా టైంలో ఆగిపోతుందా? తెలుసుకుందాం. వాస్తవానికి ఈ అద్భుతం ఒకానొక సమయంలో ఆగిపోతుంది. నదిలో నీరు ఉన్నంత కాలం మాత్రమే వెలుగుతూ ఉంటుంది. మరి నదిలో నీరు ఎప్పుడు ఎండిపోయిందా? దీపాలు వెలగడం కూడా ఆగిపోతుంది.
అయితే నది ఎప్పుడు ఎండిపోతుంది అంటారా? అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఏడాదంతా కాళీసింధ్ నది ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడో అరుదుగా మాత్రం ఇది ఎండిపోతుంది. అలాగే వర్షాకాలంలో సైతం ఈ దీపం వెలగదు. దీనికి కారణం నది నీటి మట్టం పెరగడమే. దీని వలన ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది. ఆ సమయంలో పూజలు సైతం ఆగిపోతాయి. ఎప్పుడైతే తిరిగి నీటి నుంచి ఆలయం బయటకు వస్తుందో అప్పుడే పూజలు ఆగిపోతాయి. గడియాఘాట్ మాతాజీ ఆలయం అనేది విశ్వాసం, సైన్స్‌కి మధ్య వారధిగా నిలుస్తూ ఉంటుంది.
