
పూరీ జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏ మాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రమైనా.. రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేదా నిర్మాణంలోని గొప్పదమో మరి. పూరీ జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని ఎవరూ వేస్ట్ చేయరు. పూరీ జగన్నాథ రథయాత్రకు రెండు రథాలు లాగుతారు. శ్రీమందిరం, గుండీచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్లను రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రథం దేవుళ్లను గుండీచా ఆలయానికి తీసుకెళ్తుంది.
పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. రథయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి, తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభమైంది. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఏడాది రథయాత్రలో ఒక విశిష్టత జరగుతుంది. గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక మిస్టరీ. సాయంత్రం ఆరుగంటల తర్వాత ఆలయ తలపులు మూసేస్తారు.
