గొల్లవాడిని శివయ్యకు పాలు పోయమన్న రాజు.. తర్వాతేం జరిగిందంటే..

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉన్న తిరునల్లార్ శని దేవాలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో శని దేవుడితో పాటు శివుడు కూడా కొలువై ఉన్నాడు. జాతకంలో ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉన్నవారు ఈ ఆలయంలో పూజలు చేస్తే తొలగిపోతాయని చెబుతారు. ఈ క్షేత్రంలో పరమ శివుడు దర్భారణ్యేశ్వరస్వామిగా, పార్వతి దేవి ప్రాణేశ్వరిగా పూజలందుకుంటున్నారు. అయితే ఈ ఆలయంలో ఓ నియమం ఉంది. అదేంటంటే.. అన్ని ఆలయాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడ ముందుగా శని దర్శనం చేసుకున్న తర్వాతే శివపార్వతుల దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయం ఏడాదంతా భక్తుల తాకిడితో కళకళలాడుతూ ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.

అప్పట్లో ఓ గొల్లవానికి ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు నిత్యం ఆలయంలో పాలు పోయమని ఆఙ్ఞాపించాడంట! స్వతహాగానే శివభక్తుడైన ఆ గొల్లవాడు దానికి ఆనందంగా అంగీకరించాడట. రాజు చెప్పినట్టుగానే నిత్యం దేవాలయంలో పాలు పోస్తుండేవాడు. అయితే కొన్ని రోజులకు ఆలయ అధికారి ఒకరు గొల్లవానితో శివాలయంలో పోసే పాలు తన ఇంట్లో పోయమని ఈ విషయం రాజుకు చెప్పవద్దని హెచ్చరించాడంట. దీంతో చేసేదేమీలే గొల్లవాడు అధికారి ఇంట్లో పాలు పోయడం ఆరంభించాడు. ఆలయ పూజారికి రాజుకు చెప్పడంతో ఆయన గొల్లవాడిని పిలిచి విషయమేంటని అడిగాడు. కానీ ఆ గొల్లవాడు విషయం చెప్పలేదు. చివరకు గొల్లవానికి రాజు మరణశిక్ష విధించాడు. అప్పుడు గొల్లవాడు శివుడిని వేడుకోవడంతో భక్తుడిని కరుణించాడట. ఆ సమయంలో బలిపీఠం కొంచెం పక్కకు జరిగిందట.

Share this post with your friends