యముడిని శివుడు బంధించిన ఆలయ చరిత్ర ఏంటంటే..

ఉజ్జయినిలో అద్భుతమైన శివాలయం ఉందని ముందుగానే చెప్పుకున్నాం. ఇక్కడ యమధర్మరాజును శివుడు బంధించాడని చెబుతారు. ఈ ఆలయం ఈనాటిది కాదు.. 5 వేల ఏళ్ల క్రితం నాటిది. విక్రమాధిత్య చక్రవర్తి పాలించిన కాలం నాటిదని చెబుతారు. ఇక ఈ ఆలయ చరిత్ర ఏంటంటే.. అప్పట్లో మృకండ మహర్షికి సంతానం లేకపోవడంతో బ్రహ్మ కోసం తపస్సు చేసి కుమారుడిని వరంగా పొందాడు. కొడుకు అయితే పుట్టాడు కానీ ఆ బాబు అల్పాయుష్షుతో జన్మించాడు. ఆ బాబుకి మృకండ మహర్షి మార్కండేయుడు అని నామకరణం చేసి పెంచుకోసాగాడు.

మార్కండేయుని ఆయుష్షు గురించి మృకండ మహర్షి నిత్యం ఆవేదన చెందేవాడు. అయితే తండ్రి దిగులును చూసి మార్కండేయుడు కారణం అడగ్గా అతని జన్మ వృత్తాంతం మొత్తం చెప్పాడు. అప్పుడు తండ్రి శోకాన్ని పోగొట్టేందుకు మార్కండేయుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అవంతిక తీర్థంలోని మహాకాల వనంలో ఉన్న ఆలయంలో శివుడి కోసం తపస్సు చేసి చావు నుంచి తప్పించుకునే వరం పొందాడు. ఇక మార్కండేయుడికి 12 ఏళ్ల వయసు రాగానే అతని ఆయుష్షు తీసుకెళ్లేందుకు యముడు వచ్చాడు. అప్పుడు మార్కండేయుడు శంకరుడి విగ్రహాన్ని పట్టుకున్నాడు. అప్పుడు శివుడు వచ్చి యముడిని బంధించాడని చెబుతారు.

Share this post with your friends