సకల విఘ్నాలకు అధిపతిగా గణేషుడిని పేర్కొంటూ ఉంటాం. ఎలాంటి శుభకార్యమైనా.. వ్రతమైనా.. ముందుగా మనం గణేషుడిని పూజించిన మీదటే ఇతర దేవతలను పూజించుకుంటూ ఉంటాం. హిందూ పంచాంగం ప్రకారం భాద్ర మాసంలోని శుక్లపక్షంలోని చవితి రోజున వినాయకుడి జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకోనున్నాం. ఇక వినాయచవతి స్పెషల్‌గా ఓ గుహ గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి స్నానానికి వెళుతూ పిండితో వినాయకుడిని తయారు చేసి కాపాలాగా పెట్టి వెళ్లింది. అప్పుడు శివుడు రాగా వినాయకుడు అడ్డుకున్నాడు.
శివుడు ఎంత నచ్చజెప్పినా వినాయకుడు వినలేదు. ఆగ్రహంతో శివుడు త్రిశూలంతో వినాయకుడి తలను తొలగించాడు. పార్వతీ దేవి ఆగ్రహించగా ఏనుగు తలను అతికించి వినాయకుడికి ప్రాణం పోశాడు. ఇదంతా తెలిసిన కథే. ఇక శివుడు తొలగించిన వినాయకుడి తల నేటికీ ఓ గుహలో భద్రంగా ఉందట. ఆ గుహ ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో ఉంది. ఈ గుహను పాతాళ భువనేశ్వరగా పిలుస్తారు. ఇక్కడ గణేష పూజ అంతే మస్తకానికి అభిషేకం చేయడమేనట. పర్వతం మీద దాదాపు 90 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహలో వినాయకుడు ఆదిగణేషుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ గుహను క్రీ.శ.1941లో ఆదిశంకరాచార్యులు కనుగొన్నారని చెబుతారు.