వైభవంగా శివపార్వతుల కల్యాణం.. నేడు త్రిశూలస్నానం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఆనంతరం తిరుచ్చిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

ఫిబ్రంవ‌రి 28న త్రిశూలస్నానం

బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్ర‌వారం త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరుగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.

Share this post with your friends