శ్రీశైలం జలాశయంలో కృష్ణా జలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం జలాశయం కుడి ఎడమల విద్యుత్ కేంద్రాల ద్వారా కృష్ణా జలాలను అధికారులు కిందకు తోడేస్తున్నారు. దీంతో జలాశయంలో నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం జలాశయంలో 860 అడుగుల నీటిమట్టానికి కృష్ణా జలాలు చేరాయి. ఈ క్రమంలోనే సప్తనదుల సంగమేశ్వరాలయం ఇప్పుడిప్పుడే క్రమేపి బయటపడుతోంది. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. కార్తీక మాసం చివరి రోజున ఆలయ గోపుర కలశం బయటపడటం విశేషం. ప్రముఖ శైవ క్షేతమైన సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తుల ఆశపడుతుందటారు.
సంగమేశ్వర ఆలయ గోపుర కలశం కనిపించగానే పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంధ్యాహారతి కూడా ఇచ్చారు. ఇలాగే కృష్ణా జలాలు తగ్గుముఖం పడితే త్వరలోనే మనకు అంటే మహా శివరాత్రి రోజు వరకు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి దర్శనమిస్తుందని భక్తులు భావిస్తున్నారు. సప్త నదుల సంగమేశ్వరాలయం కేవలం ఐదు నెలల మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. మిగిలిన 7 నెలలు క్రిష్ణా జలాలలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. ఏడు నెలల పాటు నీట మునిగి ఉన్నా కూడా ఈ శివలింగం ఏమాత్రం చెక్కుచెదరని అలాగే ఎంతో మహిమతో కూడుకున్నదని చెబుతారు.