ఇక్కడి అమ్మవారిని ద్వాపర యుగంలో గోపికలు తయారు చేశారట..

నవరాత్రులలో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజించుకుంటూ ఉంటాం. అమ్మవారి తొమ్మిది రూపాల్లో కాత్యాయని రూపం కూడా ఒకటి. మరి కాత్యాయని దేవి ఆలయం ఎక్కడుంది.. అంటారా? ఢిల్లీకి సమీపంలో కన్నయ్య నివాసమైన బృందానవంలో ఉంది. ఇక్కడి ఓ ఆలయంలో కాత్యాయని దేవి కొలువై ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేతులతో తిరిగి రామని చెబుతారు. ఈ ఆలయం ద్వాపర యుగం నాటిదని చెబుతారు.

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడి కాత్యాయనీ మాతను ద్వాపర యుగంలోని గోపికలు స్వయంగా తయారు చేశారట. ఇక్కడ అమ్మవారిని పూజించిన తరువాత శ్రీకృష్ణుడిని తమ వరుడిగా కావాలని గోపికలు కోరుకున్నారు. అమ్మవారి దయతో వారి కోరిక నెరవేరిందని చెబుతారు. తర్వాతి కాలంలో ఈ ఆలయం మునులు, సాధువులు తపస్సు చేసుకునే ప్రదేశంగా మారింది. శ్రీమద్ భగవత్‌ పురాణంలోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉందని చెబుతారు.

Share this post with your friends