వాసుకి నుంచి వచ్చే విషవాయువుల నుంచి గరుడ స్తంభం భక్తులను రక్షిస్తుందట..

కర్ణాటక రాష్ట్రంలో సుప్రసిద్ధ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఇది పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా, కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధార నది ఒడ్డున ఉన్న కుక్కే అనే గ్రామంలో ఈ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఉంటుంది. శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలో భాగంగా ఈ క్షేత్రంలో కొంతకాలం పాటు గడిపారని ప్రతీతి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర ధార నదిలో స్నానం చేసిన అనంతరం భక్తులు స్వామివారి దర్శనానికి వెళతారు. స్వామి దర్శనానికి మనం ఎప్పుడైనా ముందర ఉన్న ద్వారం గుండా వెళతారు. కానీ ఈ ఆలయానికి మాత్రం వెనుక తలుపు నుంచి భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకుని, మూలవిరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

మూలవిరాట్టుకు.. ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడంతో కూడిన గరుడ స్తంభం ఉంటుంది. దీని లోపల వాసుకి నివాసం ఉంటుందని అక్కడి వారు చెబుతారు. ఈ వాసుకి సర్పం ఊపిరి నుంచి వెలువడే విష కీలల ప్రభావం నుంచి భక్తులను కవచంలా కాపాడటానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠంచినట్లుగా తెలుస్తోంది. గరుడ స్తంభం తరువాత రెండు మందిరాలు ఉన్నాయి. బాహ్య మందిరం.. అంతర సుబ్రమణ్య మందిరాలు ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో ఎత్తైన పీఠం.. దాని పైభాగంలో సుబ్రమణ్య, వాసుకిల విగ్రహాలు, క్రింద భాగంలో ఆరు తలల శేషనాగు విగ్రహం ఉన్నాయి. నిత్యం ఈ విగ్రహాలన్నింటికీ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు.

Share this post with your friends