
తమిళనాడు రాష్ట్రంలోని తిలతర్పణపురి అనే గ్రామంలో నరముఖ గణపతి కొలువు దీరిన విషయం తెలిసిందే. ఇక్కడి ముక్తీశ్వరాలయ ప్రాగంణంలో నరముఖ గణపతి కొలువయ్యాడు. అసలు ఈ ఆలయ స్థలపురాణం ఏంటో ముందుగా తెలుసుకుందాం. అసలెందుకు గణపతి తన వాస్తవ రూపానికి భిన్నంగా నరుడి రూపంలో కొలువయ్యాడో తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లిన తరువాత కుమార వియోగాన్ని భరించలేని దశరథ మహారాజు మరణిస్తాడు. ఆ సమయంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నాడు.
తండ్రి మరణ వార్తను తెలుసుకున్న శ్రీరాముడు.. తన తండ్రి దశరథునికి గారపిండి ముద్దలతో పిండప్రదానం చేశాడు. అయతే తన తండ్రికి శాస్త్రోక్తంగా పిండప్రదానం చేయలేదన్న బాధ మాత్రం శ్రీరామచంద్రుడిలో ఉండిపోయింది. దీంతో రావణ సంహారం తరువాత శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రదానం చేశాడు. అయినా సరే స్వామివారికి ముక్తి లభించకలేదు. దీంతో శివుడిని శ్రీరాముడు ప్రార్ధించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై శ్రీరాముడి బాధకు విముక్తికి ఓ మార్గం చెప్పాడు. తిలతర్పణపురి ఊళ్లోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు. శివుని ఆదేశానుసారం శ్రీరాముడు తన తండ్రి దశరథుడికి పితృకార్యాలు నిర్వహించాడు. దీంతో ఆ ప్రదేశం తిలతర్పణపురిగానూ.. రాముడు తన తండ్రికి పెట్టిన నాలుగు పిండాలే శివలింగాలుగా మారాయట.
