హిందూ మతంలో వినాయక చవితికి ఉన్నంత ప్రాధాన్యత మరే పండుగకు ఉండదు. వినాయక చవితి నవరాత్రులు ఒక ఎత్తైతే గణేష్ నిమజ్జనం ఒక ఎత్తు. ఇవాళ దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనంలో భాగంగా శోభాయాత్ర జరుగుతోంది. దీనికి ముందు ప్రతి గణేష్ మండపంలోనూ ఏదో ఒకరోజు మాత్రం తప్పక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఓ గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమం తెగ వైరల్ అవుతోంది.
కోనసీమ అందాలకే కాదు.. మంచి ఫుడ్‌కి కూడా ఫేమసే. కోనసీమ జిల్లాలోని అమలాపురం నల్లచెరువు గ్రామంలో వర సిద్ధి వినాయక ఆలయం వద్ద చవితి ఉత్సవాల సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా ఏఖంగా 50 రకాల ఆహార పదార్థాలను ప్రజలకు వడ్డించడం జరిగింది. శ్రీ సిద్ధి వినాయక అన్న సంతర్పణలో స్వీట్స్, వివిధ రకాల ఆహర పదార్ధాలు అన్నీ కలిపి దాదాపు 50 రకాలు వడ్డించడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై చాలా ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.