పూరి జగన్నాథుడి కళ్లు నిత్యం ప్రతిదీ గమనిస్తుంటాయట..

పూరి జగన్నాథుని విగ్రహం ఎందుకలా అసంపూర్తిగా మిగిలిపోయిందో తెలుసుకున్నాం కదా. ఒక్క జగన్నాథుడే కాదు.. ఈ ఆలయంలో కొలువైన ఆయన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలు సైతం అసంపూర్తిగానే మిగిలియాయని చెబుతారు. వాస్తవానికి హిందూ మతం అయితే అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను పూజించడం సరికాదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విగ్రహాలకు పూజలు చేయకూడదని చెబుతుంది. కానీ పూరిలో మాత్రం అసంపూర్తిగా ఉన్న జగన్నాథుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. జగన్నాథుడు సహా అన్నాచెల్లెళ్లు విభిన్న రూపంలో దర్శనమిస్తారు.

పూరి జగన్నాథుని గుండ్రని, పెద్ద కళ్ళలో దర్శనమిస్తాడని తెలిసిందే. అయితే ఆయన కళ్లు సర్వవ్యాప్త స్వభావానికి ప్రతీకగా పరిగణిస్తారు. జగన్నాథుడు తన కళ్లతో ప్రతిదీ గమనిస్తూ ఉంటాడట. ఇక జగన్నాథుడికి చేతులు, కాళ్లు లేకపోవడాన్ని బ్రహ్మ నిరాకార రూపానికి చిహ్నంగా భావిస్తారు. అలాగే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను వేప కలపతో తయారు చేస్తారు. దీనిని ‘దారు బ్రహ్మ’ అని పిలుస్తారు. విగ్రహ మార్పు కూడా ఒక ఆసక్తికర ఆచారమే. దీనిని నబకళేబర్ ఆచారంగా పేర్కొంటారు. ఈ పద్ధతిలో పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను పెడతారు. ఈ ఆచారం.. ప్రతి 12, 14 లేదంటే 19 సంవత్సరాలకోసారి జరుగుతుంది.

Share this post with your friends