భక్తుని కోసం ఆగిన రథం.. ఎంతమంది లాగినా కదల్లేదట..

నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడ పట్టణం నుంచి 14 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. ఆయన ప్రతి ఏటా నాగలమడక నుంచి కాలి నడకన దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకునేందుకు వెళ్లేవారట. అయితే తర్వాతి కాలంలో అన్నంభట్టు వృద్ధుడై పోవడంతో సుబ్రహ్మణ్యుని రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారట.

అప్పుడు రథం అక్కడి నుంచి కదల్లేదట. ఎంతమంది వచ్చి లాగినా కూడా రథం మాత్రం కదల్లేదట. చివరకు అన్నంభట్టు అక్కడకు చేరుకుని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందట. అన్నంభట్టు తన వృద్ధాప్యం కారణంగా కుక్కేకు రాలేడని భావించి నాగాభరణంను ఇచ్చి నాగలమడకలోనే ఉంటూ తనను సేవించుకోమని సుబ్రహ్మణ్య స్వామి చెప్పాడట. ఇది ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. అన్నంభట్టు ఈ నాగాభరణాన్ని తీసుకు వచ్చి నాగలమడకలో ప్రతిష్టించడం వలన ఈ ప్రదేశానికి నాగల మడక అని పేరు వచ్చింది.

Share this post with your friends