నేటితో ముగియనున్న శ్రీ గోదా సమేత రంగనాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు

నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం శ్రీ గోదా సమేత రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 15వ తేదీన బ్రహ్మోత్సవాలు అభిషేకం, తిరుమంజనముతో ప్రారంభమయ్యాయి. రెండవ రోజు అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఇక నిన్న రాత్రి 7:30 గంటలకు స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.

నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 18న మహా పూర్ణాహుతి, చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ముగింపు పలకనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం.. దేవతోధ్వాసన, ద్వాదశారాధన, ధ్వజ అవరోహనం,కుంభప్రోక్షణ, మహదాశీర్వచనం, ఆచార్య, యాజమాన్య, బుుత్విక్కులకు సన్మానం జరగనుంది. తమిళనాడు శ్రీరంగంలోని రంగనాయకస్వామిని పోలిన విధంగానే ఈ ఆలయంలోని రంగనాయక స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం నిర్మించారు.

Share this post with your friends