
శివుడిని రేపు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ పట్టి ఉంటానని శనిదేవుడు చెప్పాడు. దీంతో శివుడు బిల్వవృక్షంలో దాక్కొన్నాడు. సాయంత్రానికి ఒకేసారి బిల్వవృక్షం నుంచి ఇద్దరూ బయటకు వచ్చారు. అప్పుడు శనిని చూసరి శివుడు.. ‘నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు’ అని చెప్పాడు. అప్పుడు శనిదేవుడు.. శివుడికి నమస్కరించి తనను మన్నించమని కోరాడు. తాను పట్టినకారణంగానే తమరు కైలాసం విడిచి బిల్వ వృక్షాన్ని ఆశ్రయించారని చెప్పాడు. ఇది నిరూపించేందుకే తాను కూడా మీతో పాటు బిల్వవృక్షంలో అదృశ్యంగా ఉండిపోయానని శివుడికి చెప్పాడు.
ఇదంతా తన ప్రతిభ కాదని… ఇదంతా శివలీల మహత్యమేనని శని దేవుడు చెప్పాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు పరమేశ్వరుడు కదలిపోయాడు. ముల్లోకాలకు ఈశ్వరుడినైన తనను కొద్దికాలం పాటు పట్టి ఉండడంతో నేటి నుంచి శని.. శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడని వరమిచ్చాడు. అంతేకాక శని దోషం ఉన్నవారు ఆ దోష పరిహారార్థం తనను బిల్వ పత్రములతో పూజిస్తే వారికి దోష విముక్తి కలుగుతుందని చెప్పాడు. అందుకే శివయ్యను బిల్వ పత్రాలతో పూజ చేసిన వారిని, శివ భక్తులను శనీశ్వరుడు ఎన్నటికీ బాధించడని చెబుతారు.
