హనుమంతుడిని హిందువులంతా చాలా భక్తితో కొలుస్తారు. ఆయన ఆశీస్సులు ఉంటే ఎలాంటి సందర్భంలోనూ భయపడాల్సిన అవసరం అనేది ఉండదంటారు. శక్తితో పాటు ధైర్యాన్ని ప్రసాదించే దేవుడిగా హిందువులు హనుమంతుడిని కొలుస్తారు. ఈ క్రమంలోనే హనుమంతుడికి భారతదేశమంతటా ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రత్యేకం.. అలాంటి ఒక ఆలయం గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద ఉన్న పవిత్ర నగరంలో ఇప్పుడు మనం చెప్పుకునే ఆంజనేయుడు కొలువై ఉన్నాడు.
ప్రయాగ్‌రాజ్ నగరానికి బడే ఈ ఆంజనేయుడి ఆలయం కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ హనుమంతుడి ఆలయాన్ని బడే హనుమాన్ దేవాలయమని.. లేటే హనుమాన్ మందిర్ అని కూడా అంటారు. ఈ ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతే భక్తులను ఇక్కడికి రప్పిస్తోంది. ఏ ఆలయంలోనైనా హనుమంతుడు నిలుచుని కనిపిస్తే ఇక్కడ మాత్రం పడుకుని దర్శనమిస్తాడు. ఇలా హనుమంతుడు ఇక్కడ తప్ప మరెక్కడా పడుకుని కనిపించడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇక్కడ స్వామివారి విగ్రహం ఒకవైపు గంగానదిలో మునిగిపోయి కనిపిస్తుంది.