దక్షిణ భారత దేశంలోని ఎన్నో ఆలయాలు అద్భుతమైన శిల్పకళా సంపదకు పుట్టినిల్లు. అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని మధురై నగరంలో ఉంది. 45 ఎకరాల్లో ఈ ఆలయం ఉంటుంది. దీనిలోని శిల్పకళను చూస్తే మైమరిచిపోతాం. ఇక్కడ మీనాక్షీ దేవి కొలువైంది. ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి స్తన్యాలకు సంబంధించి ఒక ఆసక్తికర కథ ఉంది. అమ్మవారికి తొలుత మూడు స్తన్యాలుండేవట. శివుడిని చూడగానే మూడో స్తన్యం మాయమైందట. ఆ కథేంటో చూద్దాం. పార్వతీ దేవి అవతారమే మీనాక్షి దేవి. మీన అంటే చేప.. చేప వంటి కన్నులు కలదని అర్థం. మీనాక్షి దేవి ఎవరు శివుని భార్య అయిన పార్వతీ దేవి అవతారమే మీనాక్షిదేవి. అమ్మవారు నిజంగానే తన కళ్లతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా సంతానం లేని భక్తులకు ఈ అమ్మవారు సంతానం ప్రసాదిస్తుందట. ఇక మూడు స్తన్యాల కథేంటంటే.. రాజు మలయధ్వజ పాండ్య , రాణి కాంచనమాలలకు మీనాక్షీదేవిగా పార్వతీదేవి జన్మించింది. మూడేళ్ల వయసులో మూడు స్తన్యాలు అమ్మవారికి కనిపించాయి. అయితే అవి తనకు కాబోయే భర్తను చూసినప్పుడు పోతాయని ఆకాశవాణి సందేశం ద్వారా తెలిసిందట. మీనాక్షీ దేవి శక్తివంతమైన పాలకురాలిగా ఉంటూనే వివిధ రాజ్యాలను జయించింది. ఈ సమయంలోనే ఇకసారి శివుడిని కలిసిందట. ఆయనను చూడగానే మూడో స్తన్యం మాయమైందట. అప్పుడే ఆమెకు శివుడే తనకు కాబోయే భర్త అని తెలిసిందట. ఆ తరువాత శివుడు సుందరేశ్వరుడిగా మీనాక్షిదేవిని వివాహమాడాడట. మధురైలో ప్రతి ఏటా వీరి వివాహాన్ని మీనకాశీ తిరుకల్యాణం లేదా చితిరై పండుగగా జరుపుకుంటారు.