తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన సెల్ ఫోన్లు, వాచీలను తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేయనుంది. ఆగస్టు 12 మరియు 13వ తేదీలలో టెండర్ కం వేలం (ఆఫ్ లైన్) ద్వారా వేలం వేయనున్నారు. ఇందులో ఉపయోగించినవి/ పాక్షికంగా దెబ్బతిన్న సెల్ ఫోన్లు (22 లాట్లు ) మైక్రోసాఫ్ట్, ఆసస్, జీఓణి, హువై, ఎల్జీ, మోటోరోలా, సోనీ, రెడ్ మీ , యం ఐ, ఐటెల్, లేనోవా, రియల్ మి, పోకో, ఆనర్, మైక్రొమాక్స్ , నోకియా, కార్బన్, లావా, జీఓ, సెల్కాన్, యెల్ యెఫ్ వై ఇతర సెల్ ఫోన్లు వున్నాయి.
అదే విధంగా ఉపయోగించినవి లేదంటే పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు (13 లాట్లు )ను వేలం వేయనున్నారు. ఈ వాచ్‌లలో టైటాన్, ఫాస్ట్ ట్రాక్, సోనాటా, హెచ్ యం టి, కాసియో, టైమెక్స్ , స్మార్ట్, సిటిజెన్ , టైమ్స్, టైమ్ వెల్, ఫోస్సిల్ మొత్తం (35) లాట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు)/ఏఈఓ(వేలములు) , టీటీడీ, హరేకృష్ణ మార్గ్, తిరుపతి లో/ 08772264429 ఫోన్ నెంబర్ ద్వారా కానీ వెబ్‌సైట్ అడ్రస్ www.tirumala.org ద్వారా గాని సంప్రదించాలని టీటీడీ అధికారులు తెలిపారు.