కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ప్రారంభం..

కార్తీక మాసం సందర్భంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పెద్ద ఎత్తున పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు సైతం పెద్ద ఎత్తున హాజరై ఈ పూజా కార్యక్రామాల్లో పాల్గొంటున్నారు. కార్తీక మాసం ఆరంభంలో ఆలయంలో గణపతి హోమం ప్రారంభించారు. ఈ గణపతి హోమం మూడు రోజుల పాటు వైభవంగా కొనసాగింది. సోమవారంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి హోమం పూర్తైంది. నేటి నుంచి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమాన్ని వేద పండితులు, ఆలయ అర్చకులు ప్రారంభించారు.

నేటి నుంచి 7వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. న‌వంబ‌రు 7న సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణాన్ని నిర్వహించనున్నారు. అనంతరం నవంబర్ 8న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 9న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం) నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబరు 29న శ్రీ శివ‌పార్వ‌తుల క‌ల్యాణం చేప‌డ‌తారు.

Share this post with your friends