సింధూర వినాయకుడి స్థల పురాణం మరింత ఆసక్తికరం..

తెలంగాణలోని ప‌టాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో కొలువైన గణేశుడి గురించి తెలుసుకున్నాం. ఈ స్వామివారిని ఏదైనా కోరిక కోరికుని 11 ప్రదక్షిణలు చేస్తే 41 రోజుల్లో మన కోరిక నెరవేరుతుందట. ఈ ఆలయ స్థల పురాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. శివరామ భట్టు అనే కర్ణాటకకు చెందిన వ్యక్తికి విఘ్నేశ్వరుడిపై అపరమిత భక్తి. ఒకసారి శివరామ భట్టు కాలినడకన తిరుమలకు వెళుతున్నాడట. ఆ రోజు సంకష్ట చతుష్టి కావడంతో మార్గమద్యంలో రుద్రారం అడవుల్లో ఆగి సింధూరంతో వినాయకుడి విగ్ర‌హాన్ని త‌యారుచేసి పూజించాడు.

ఆ తరువాత ఆ విగ్ర‌హాన్ని అడ‌విలోనే వ‌దిలేసి శివ‌రామ భ‌ట్టు తిరుమ‌లకు వెళ్లిపోయాడు. ఆయన తయారు చేసిన సింధూర విగ్రహం కొన్నాళ్లకు కనుమరుగైంది. కొంత కాలానికి మఖందాస్ అనే భ‌క్తుడు అడ‌విలో గుర్రంపై సంచ‌రిస్తున్నాడు. ఆ సమయంలో శివ‌రామ భ‌ట్టు పూజించిన సింధూర గ‌ణ‌నాథుడి విగ్రహం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుర్రం క‌ద‌ల్లేక‌పోయింది. దీంతో ఆ విగ్ర‌హం ప‌క్క‌నే మ‌ఖందాస్ నిద్ర‌పోయాడు. వినాయకుడు మఖందాస్‌కి కలలో కనిపించి త‌న‌కు అక్క‌డే చిన్న గుడి క‌ట్టాల‌ని చెప్పాడు. వెంటనే మ‌ఖందాస్ స్వామివారు చెప్పినట్టుగా గుడి క‌ట్టించే పని మొద‌లుపెట్టాడు. అలా ఈ ఆల‌యం కాలక్రమంలో ఎంతో ఫేమస్ అయిపోయింది.

Share this post with your friends