తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లను జారీ చేస్తున్నారు. కానీ ఇక మీదట గతంలో మాదిరిగానే శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు అంటే రేపటి నుంచి ఏ రోజు కారోజు ఎస్ఎస్‌డి టోకెన్లను అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ఎస్‌డి టోకెన్లను పొందవచ్చు.
శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు
ఎన్‌బీఏ గుర్తింపు గల తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా (DPH) కోర్సులో ప్రవేశానికి జనవరి 24వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ ఉతీర్ణత పొందిన ఆసక్తి గల విద్యార్థినులు విద్యార్హత సర్టిఫికెట్లతో జనవరి 23వ తేదీ సాయంత్రంలోపు అన్ని ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన కోర్సు ఫీజుతో విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారు. సీట్లు పరిమితంగా ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 9299008151, 9247575386, 8978993810 నంబర్లను సంప్రదించగలరు.