మాఘ పూర్ణిమ నేపథ్యంలో మహాకుంభమేళాలో పూల వర్షం

తిరుమల శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం భజన మండళ్ల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స‌భ్యులు శ్రీ భానుప్ర‌కాష్ రెడ్డి అన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ భానుప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విగ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుకు చెందిన 3,500 మంది భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్య‌లు పాల్గొన్నారు.

Share this post with your friends