శ్రీవారి బ్రేక్ దర్శనానికి వారానికి ఆరు రోజులకే అనుమతివ్వాలి..

ఇవాళ ఏపీ శాసన మండలిలో తిరుమల అవినీతిపై చర్చ జరిగింది. పరాకామణి సహా వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని పలువురు అధికార పక్ష ఎమ్మెల్సీలు ఆరోపించారు. పరాకమణిలో భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి అన్నారు. 100 కోట్లు యూఎస్ డాలర్లను రవికుమార్ అనే ఉద్యోగి పక్కదారి పట్టిస్తే కనీసం కేసు కూడా లేకుండా చేశారని ఆరోపించారు. తిరుమలలో జరిగిన అవివీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తిరుమలను భ్రష్టుపట్టించారని.. అనేక మాఫీయాలు తయారయ్యాయని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అన్నారు.

ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభమైందని.. త్వరలోనే గాడిలో పెడతామన్నారు. ముందు శ్రీ వాణి ట్రస్ట్ నిధులపై విచారణ చేస్తామని మంత్రి ఆనం అన్నారు. ఈ క్రమంలోనే శ్రీవారి బ్రేక్ దర్శనం కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి బ్రేక్ దర్శనం విషయంలో పరిమితులు విధించాలని సభ్యులు కోరారు. బ్రేక్ దర్శనానికి వారానికి ఆరు రోజులకు మాత్రమే సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని సభ్యులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలలో సమానంగా ఎమ్మెల్సీలకు సైతం తిరుమలలో ప్రాధాన్యం ఇవ్వాలని సభ్యులు కోరారు.

Share this post with your friends