ఇవాళ తెప్పలపై విహరించనున్న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఇవాళ్టి నుంచి వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 వరకూ ఈ తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ నాలుగు రోజుల పాటు అమ్మవారు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ పద్మసరోవరంలో తెప్పలపై విహరించనున్నారు. శ్రీ అలమేలు మంగమ్మ ఈ ఉత్సవాల్లో పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకుంటారు. అమ్మవారి తెప్పోత్సవాలను ఏడాదికి ఒకసారే నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని వేద పండితులు చెబుతారు.

అలమేలు మంగమ్మ.. పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి జీవకోటికి మాతృమూర్తిగా మారుతుందట. ఈ క్రమంలోనే భక్తులను భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. ఇవాళ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి తెప్పలపై విహరించనునున్నారు. రెండో రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించ‌నున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ రాత్రి సమయంలో అమ్మవారికి వివిధ రకాల సేవలను నిర్వహించనున్నారు.

Share this post with your friends