హనుమంత వాహనంపై శ్రీ సుందరరాజస్వామివారి కటాక్షం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ అవతార మహోత్సవాలు నేడు మూడవ రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజైన గురువారం శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇక స్వామివారి అవతార మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై విహరించి స్వామివారు భక్తులను కటాక్షించారు.

సాయంత్రం శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ నిర్వహించారు. రాత్రి స్వామివారి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. కాగా ఇవాళ రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. చాలా ఏళ్ల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు యత్నించగా.. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారట. అనంతరం 1902లో అంటే మహంతుల కాలంలో మూలమూర్తులను తయారు చేసి ప్రతిష్టించారట. అప్పటి నుంచి స్వామివారికి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Share this post with your friends